Year Ender 2022: ఈ ఏడాదిలో యూట్యూబ్‌ను షేక్ చేసిన సాంగ్స్ ఇవే..
ఈఏడాది సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వచ్చేసింది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. మరోవైపు... పలు చిత్రాల్లోని సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మరి ఈ ఏడాది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి.. సంగీత ప్రియులను ఊర్రూతలుగించిన సాంగ్స్ ఏంటో తెలుసుకుందామా.
Songs
Follow us on
ఈఏడాది సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వచ్చేసింది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. మరోవైపు… పలు చిత్రాల్లోని సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మరి ఈ ఏడాది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి.. సంగీత ప్రియులను ఊర్రూతలుగించిన సాంగ్స్ ఏంటో తెలుసుకుందామా.
డీజే టిల్లు.. బ్లాక్ బస్టర్ హిట్. సిద్దూ జొన్నల గడ్డ.. నేహా జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలోని అన్ని సాంగ్స్ హిట్ కాగా.. రామ్ మిర్యాల ఆలపించిన టిల్లు అన్న డీజే పెడితే సాంగ్ కుర్రాళ్లను ఊర్రూతలుగించింది.
ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. కృతి శెట్టి జంటగా నటించిన ది వారియర్ డిజాస్టర్ కాగా.. ఇందులో బుల్లెట్ సాంగ్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ఇక దళపతి విజయ్.. పూజా హెగ్డే నటించిన బీస్ట్ చిత్రం పర్వాలేదనిపించుకుంది. ఇందులో హలమితి హబిబో సాంగ్ మాత్రం యూట్యూబ్ ను షేక్ చేసింది.
అలాగే సుదీప్ కిచ్చా నటించిన విక్రాంత్ రోణ చిత్రంలోని రా రా రక్కమ్మ సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ నటించిన సినిమా సర్కారు వారి పాట. ఈ మూవీ సూపర్ హిట్ కాగా.. ఇందులో కళావతి.. మా.. మా మహేష సాంగ్ అదరగొట్టింది.
మెగాస్టార్ చిరంజీవి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ కాగా.. ఇందులోని ప్రతి పాట సూపర్ హిట్. ముఖ్యంగా భలే భలే బంజారా సాంగ్ అదిరిపోయింది.
యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ ఇందులో రా.. రా రెడ్డి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.