Rajeev Rayala |
Apr 24, 2022 | 1:37 PM
మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కియారా అద్వానీ
ఈ అమ్మడు ఆతర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆతర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా .. కియారా అద్వానీ.. వీరిద్దరి ప్రేమ.. బ్రేకప్ వ్యవహరం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
గత కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టాక్ నడిచింది. తరచూ ఇద్దరూ కలుసుకోవడం..మీడియాకు ఎదురుపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తుంచాయి.
అయితే ఆకస్మాత్తుగా వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది
ఒకరినొకరు కలుసుకోవడం.. మాట్లాడుకోవడం మానేశారని టాక్ నడుస్తోంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ వారి సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.