
అయితే అసలు ఈ ట్యాగ్ చిరంజీవి కాకుండా మరో హీరో అందుకునే వారంట. వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మెగస్టార్ అయ్యేవారంట, కానీ చివరు చిరంజీవికి తన అభిమానులే స్వయంగా ఈ ట్యాగ్ ఇచ్చారు. అయితే చిరు కాకుండా మెగాస్టార్ ట్యాగ్ అందుకునే హీరో ఎవరా? అని ఆలోచిస్తున్నారా?

టాలీవుడ్‌లో లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అందరికీ టక్కున గుర్తు వచ్చే పేరు శోభన్ బాబు. ఆయన అందానికి, నటనకు అప్పటి వారు ఫిదా అయిపోయేవారంట. అంతేకాకుండా అప్పటి లేడీస్ కలల రాజు అంటే ఈ హీరోనే అనే వారంట, అంతలా లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు శోభన్ బాబు.

అయితే వరసగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే శోభన్ బాబుకు చిరంజీవి కంటే ముందు మెగాస్టార్ ట్యాగ్ రావాల్సి ఉండేదంట.

అయితే ఆయనకు ఉన్న లేడీ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని, మెగాస్టార్ కాకుండా, ఆంధ్ర అందగాడు అనే ట్యాగ్ ఇచ్చారంట తన అభిమానులు. మెగాస్టార్ కంటే, ఆంధ్ర అందగాడే శోభన్ బాబుకు బాగుంటుంది. సెట్ అవతుందని ఆలోచించి ఆ ట్యాగ్‌నే ఫిక్స్ చేశారంట.

దీంతో అప్పడే మంచి ఫామ్‌లో ఉండి వరసగా బ్లాబ్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న చిరంజీవికి మెగాస్టార్ అనే ట్యాగ్ వరించింది.అలా చిరుకు మెగాస్టార్ ట్యాగ్ వచ్చింది. శోభన్ బాబుకు మిస్ అయ్యింది అంటున్నారు జనాలు.