
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప గత ఆరు నెలలుగా ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఈ కేసులో దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

దర్శన్ మైసూర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సంక్రాంతిని జరుపుకున్నారడు. ఈ వేడుకలో అతని కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో దర్శన్ తన భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌తో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు దర్శన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది హ్యాపీ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే దర్శన సోదరుడు దినకర్ కూడా ఈ ఫొటోల్లో కనిపించాు. కుటుంబ సభ్యులందరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ చాలా రోజుల పాటు జైలులో ఉండిపోయాడు. అయితే గతేడాది డిసెంబర్ 13న ఈ నటుడికి బెయిల్ మంజూరైంది.