Tollywood: అట్టహాసంగా ప్రారంభమైన చిరు, శ్రీదేవిల చిత్రం ఎందుకు ఆగిపోయిందంటే..?

Updated on: Jul 17, 2026 | 4:25 PM

మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో శ్రీదేవి సొంత నిర్మాణ సంస్థలో ప్రారంభమైన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. గొప్ప అంచనాలతో ప్రారంభమైన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ.. ఎందుకు ఆగిపోయింది..? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం .. ... ..

1 / 6
మెగాస్టార్ చిరంజీవి, అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో నాలుగు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తక్కువ చిత్రాల్లోనే కలిసి నటించినా, శ్రీదేవి పట్ల చిరంజీవికి ప్రత్యేక అభిమానం ఉండేది. ఈ నాలుగు చిత్రాలు కాకుండా, వీరి కాంబినేషన్‌లో మరో సినిమా మొదలై మధ్యలోనే ఆగిపోయింది. ఇది కేవలం వారిద్దరి కాంబినేషన్ కావడమే కాకుండా, శ్రీదేవి సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కాల్సిన చిత్రం కావడం విశేషం. 40 ఏళ్ల క్రితం ప్రారంభమై ఆగిపోయిన ఈ సినిమా వెనుకనున్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
శ్రీదేవికి హిందీలో అద్భుతమైన మార్కెట్ ఉన్నప్పటికీ, తెలుగులోనే సొంత సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. తన చెల్లెలు శ్రీలత పేరుమీద శ్రీలత క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఆమె తల్లి రాజేశ్వరి అయ్యప్పన్ నిర్మాతగా వ్యవహరించగా, శ్రీదేవి సమర్పకురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మణిరత్నం రూపొందించిన మౌనరాగం సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ స్ఫూర్తితో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ తయారుచేశారు. మంచి పాటలతో కూడిన మ్యూజికల్ లవ్ స్టోరీని తెరకెక్కించాలన్నది శ్రీదేవి సంకల్పం. ఈ ప్రాజెక్టుకు హైప్ రావాలంటే నెంబర్ వన్ కథానాయకుడు చిరంజీవి ఉండాలని శ్రీదేవి భావించారు. తన తల్లితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళి కథ చెప్పారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి సారథ్యంలో ఏడు పాటలు, ముంబై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వంలో ఈ సినిమాను తీయాలనుకుంటున్నట్లు శ్రీదేవి వివరించగానే, చిరంజీవి వెంటనే అంగీకరించారు.

3 / 6
డిసెంబర్ 6 సాయంత్రం 5:15 నిమిషాలకు ఏవీఎం స్టూడియోలో జరిగిన చిత్ర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ హాసన్, రాధికా వంటి ప్రముఖులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వేటూరి రాసిన "అందం చందం ఎంతో ఎంతో" అనే పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొదలైంది. 10 రోజుల పాటు జరిగిన షూటింగ్‌తో ఆ పాట పూర్తయింది. ఆ తర్వాత ముంబైలో పాటలు రికార్డింగ్ చేశారు. శ్రీదేవికి సంగీతం పట్ల మంచి అవగాహన ఉండటంతో, బప్పీలహరికి ఎలాంటి పాటలు కావాలో వివరించి, దగ్గరుండి రికార్డ్ చేయించుకున్నారు. సినిమా రెండో షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

4 / 6
నిర్మాణ సమయంలోనే ఈ సినిమాకు అపూర్వమైన క్రేజ్ వచ్చింది. బయ్యర్లు సినిమా హక్కుల కోసం పోటీపడ్డారు. కోదండరామిరెడ్డి వంటి దర్శకులను సిఫార్సు చేయమని చాలామంది కోరారు. ఈ క్రేజ్ చూసిన తర్వాత కోదండరామిరెడ్డికి ఒక సందేహం కలిగింది. చిరంజీవి, శ్రీదేవి చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న ఈ సినిమా, పైగా శ్రీదేవి సొంత చిత్రం, ప్రజల అంచనాలను అందుకోలేకపోతే చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆందోళన చెందారు.

5 / 6
దీంతో కోదండరామిరెడ్డి నేరుగా శ్రీదేవి వద్దకు వెళ్లి, ఎంపిక చేసిన కథపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఏమి చేద్దామని అడిగారు. పాటలు బాగా వచ్చాయని, అయితే సబ్జెక్టు గురించి తనకు పెద్దగా తెలియదని శ్రీదేవి బదులిచ్చారు. కొన్నాళ్లు షూటింగ్ ఆపేసి వేరే కథతో సినిమా తీద్దామని సూచించారు. చిరంజీవితో మాట్లాడి షూటింగ్‌ను నిలిపివేశారు. తర్వాత చాలామంది రచయితలతో చర్చలు జరిపారు. ఒక దశలో మిస్టర్ ఇండియా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని కూడా అనుకున్నారు. చిరంజీవి ఆ సినిమా చూసి, నిడివి ఎక్కువగా ఉందని భావించారు. చివరికి సరైన కథ లభించక, ఈ సినిమా శాశ్వతంగా ఆగిపోయింది.

6 / 6
ఆ తర్వాత కొండవీటి దొంగ సినిమాకు హీరోయిన్‌గా మొదట శ్రీదేవిని అనుకున్నారు. నిర్మాత త్రివిక్రమరావు, దర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీదేవిని కలిసి, హీరోయిన్‌గా నటించమని అడిగారు. తమ కాంబినేషన్‌లో మొదలైన సినిమా కుదరలేదు కనీసం ఇదైనా చేద్దామని కోదండరామిరెడ్డి శ్రీదేవిని కోరారు. సినిమా పేరు అడిగినప్పుడు, కొండవీటి దొంగ అని చెప్పారు. శ్రీదేవి ఆలోచించుకుని చెబుతానని అన్నారు. అప్పుడు త్రివిక్రమరావు, ఆమె రికార్డ్ చేసిన పాటల్లో రెండు తమకు ఇవ్వమని, ఎంత ఖర్చయ్యిందో చెబితే ఇచ్చేస్తానని అడిగారు. అయితే, తాను పాటలను అమ్ముకునే రకం కాదని, ఆ పాటలెవరికీ ఇవ్వనని శ్రీదేవి స్పష్టం చేశారు. తర్వాత తల్లితో ఆలోచించుకుని కొండవీటి దొంగ సినిమాలో నటించడానికి అంగీకరించారు. శ్రీదేవి సొంత సినిమాలో ఆమె పాత్ర పేరు శ్రీజ. ఆ సినిమా ఆగిపోయినా, ఆ పేరు చిరంజీవి మదిలో నిలిచిపోయింది. కొన్నేళ్ల తర్వాత తన చిన్న కూతురికి శ్రీజ అని పేరు పెట్టుకున్నారు చిరంజీవి.

Follow Us