
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. తొలి సినిమాతోనే అడియన్స్ హృదయాలు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తుంది.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ దివ్య భారతి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. మదిల్ మెయిల్ కాదల్ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

అయితే కాలేజీలో దివ్య భారతీ తన బాడీ షేప్ గురించి అనేక విమర్శలు ఎదుర్కొదంట. తనను ఫాండా బాటిల్, అస్థిపంజరం వంటి మాటలతో పిలిచేవారని.. దీంతో తనను తాను ఎంతో ద్వేషించుకున్నానని.. నడిచేందుకు సైతం భయపడినట్లు గుర్తుచేసుకుంది.

కానీ 2015లో ఇన్ స్టాలో తన ఫోటో షేర్ చేయడంతో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయని.. దీంతో తన ఆత్మ విశ్వాసం పెరిగి మోడలింగ్ వైపు అడుగులు పడినట్లు తెలిపింది. ఇక ఇప్పుడు క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట సెన్సేషన్ అవుతుంది.