
2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కావ్య థాపర్. తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి వరుస్ ఆఫర్స్ వచ్చాయి.

ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అందుకుంది. 2021లో ఏక్ మినీ కథ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హిందీలో మిడిల్ క్లాస్ లవ్ చిత్రంలో నటించింది.

ఆ తర్వాత తమిళంలో పిచ్చైకారన్ 2 (తెలుగులో బిచ్చగాడు 2) చిత్రంలో నటించింది. ఈ సినిమాతోపాటు ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

అయితే కావ్య నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు.

కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలాగే గ్లామర్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.