
సుప్రీం కోర్టు లాయర్ గా మారిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె పేరు రేష్మా రాథోడ్. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈరోజుల్లో సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కథానాయికగా సూపర్ సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆ చిత్రాలు హిట్ కాకపోవడంతో ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ కూడా రాలేదు. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది.

అయితే తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీకి కలిసిరాలేదు. అయితే 2017కు సినిమలకు బ్రేక్ తీసుకున్న ఆమె.. ఆ తర్వాత లాయర్ పూర్తి చేసింది. నటిగా పెద్ద పేరు పొలిటికల్ లాయర్ గా తనదైన మార్క్ చూపిస్తోంది.

ఇటీవల సుప్రీంకోర్టు లాయర్ గా పదోన్నతి పొందింది. అప్పట్లో ఒకలా ఉన్న రేష్మ ఇప్పుడు చాలావరకు మారిపోయింది. తెలుగలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవడం చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

రేష్మ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలవర్లను ఆకట్టుకుంటుంది. అయితే తెలుగు హీరోయిన్ ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.