
https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-sreeleela-reacts-on-love-and-marriage-rumors-1355077.html

మానసికంగా చాలా కుంగిపోయేదాన్ని అని.. చనిపోయేందుకు చాలాసార్లు ప్రయత్నించానని.. ఈ జన్మ వద్దని.. చనిపోయాక మరో జన్మ కావాలని దేవుడిని వేడుకున్నానని తెలిపింది. సూసైడ్ చేసుకోవడానికి నిద్రమాత్రలు తీసుకున్నాని.. తన బ్యాంక్ వివరాలు సోదరుడికి పంపడంతో కంగారు పడిపోయాడని తెలిపింది.

నా సోదరుడు మా అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నన్ను నిద్రలేపేందుకు ప్రయత్నించింది. ఆ వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. నా శరీరంలో ఉన్న విషాన్ని తీసి బతికించారు. ఆ తర్వాత రెండు మూడేళ్లు నాకు చాలా కష్టంగా గడిచాయి. గది దాటి బయటకు రాలేదు.

నా గదిలోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. చాలా కాలానికి నేను తప్పు దారిలో వెళ్తున్నానని అర్థం చేసుకుని దాని నుంచి బయటకు వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. షామా సికిందర్ హిందీలో అనేక చిత్రాల్లో నటించింది.

యే మేరి లైఫ్ హై, బల్ వీర్, మన్ మే హై విశ్వాస్ వంటి సీరియల్స్ చేసింది. ఆ తర్వాత ప్రేమ్ అగ్గన్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె.. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 2019లో బైపాస్ రోడ్ చిత్రంలో నటించింది.