
బిగ్ బాస్ పుణ్యమా అని మంచి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. దివి తన గేమ్ తో పాటు అందంతో ఆకట్టుకుంది.

ఈ అమ్మడు ముందుగా మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

దివి బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. గేమ్ తో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది దివి. 'సిలక ముక్కుదానా' అనే మ్యూజిక్ వీడియోలో నటించింది.

2017లో మోడలింగ్‌తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఆమె పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది.

2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్, 2021లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.