పాన్ ఇండియా స్టార్ హీరోప్రభాస్ మరోసారి తనలోని సేవా భావం, ఉదారతను చాటుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ప్రభాస్ 10 లక్షల విరాళం పంపించాడు.
ఈ మేరకు ఈ మేరకు ప్రభాస్ ఆత్మీయులు రూ.10 లక్షల చెక్కును భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవికి శనివారం అందించారు.
భద్రచాలం దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం కోసం ప్రభాస్ ఈ విరాళాన్ని రాములోరికి సమర్పిస్తున్నారని ఆయన ఆత్మీయులు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్‌ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు, సినీ అభిమానలు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్, కృతిసనన్ సీతారాములుగా వస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
రామాయణానికి 3డీ వర్షన్‌గా వస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తమ సినిమా విజయవంతం కావాలనే సంకల్పంతో ప్రభాస్ ఈ విరాళం సమర్పిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రాములోరి దేవాలయంలో భక్తుల అన్నదానం కార్యక్రమం కోసం ప్రభాస్ విరాళం అందించడంతో ఈ స్టార్ హీరోపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.