ఇండియన్ సినిమాలో గ్లామర్ దివా అనిపించుకునే రేంజ్ బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. కానీ రిస్కీ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఈజీగా క్యారీ చేయగలిగే గ్రేస్ ఉన్న బ్యూటీస్ మాత్రం చాలా లిమిటెడ్‌గానే కనిపిస్తుంటారు. రెడ్ కార్పెట్ మీద రివీలింగ్ కాస్ట్యూమ్స్‌లో రచ్చ చేస్తున్న బ్యూటీస్ గ్లామర్ వరల్డ్ అటెన్షన్‌ను గట్టిగానే గ్రాబ్ చేస్తున్నారు.
ఈ లిస్ట్‌లో ఆల్వేజ్ ఆన్ టాప్ అనిపించుకుంటున్నారు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ ఎంట్రీ తరువాత గ్లామర్ విషయంలోనూ గ్లోబల్ రేంజ్ మెయిన్‌టైన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫిలిం ఈవెంట్స్‌లో ప్రియాంక ప్రెజెన్స్ ఎప్పుడూ హాట్ టాపికే. వెస్ట్రన్ బ్యూటీస్ కూడా అవాక్కయ్యేలా చేస్తూ.. గ్లామర్ వరల్డ్‌లో తన ఐడెంటిటీని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకుంటున్నారు పీసీ.
గ్లోబల్ రేంజ్‌కు చేరకపోయినా... నేషనల్ లెవల్‌లో తనదైన స్టైలింగ్‌తో మెప్పిస్తున్న బ్యూటీ జాన్వీ కపూర్. ఫిలిం ఈవెంట్స్‌తో పాటు పేజ్ త్రీ పార్టీస్‌లో జాన్వీ లుక్స్ టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇలాంటి కాస్ట్యూమ్స్‌లో కనిపించటం మీద నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నా... జాన్వీ మాత్రం తన ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు.
సిల్వర్ స్క్రీన్ మీద ఫామ్‌లో లేకపోయినా గ్లామర్ వరల్డ్‌లో మోస్ట్ పాపులర్ బ్యూటీ మలైకా అరోరా. సీనియర్ హీరోయిన్స్‌తో పార్టీస్... యంగ్ హీరోతో రోమాన్స్ చేస్తూ రెగ్యులర్‌గా వార్తల్లో కనిపించే మలైకా.. కెవ్వు కేక అనిపించే రేంజ్‌లో ఫ్యాన్స్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు.
సీనియర్లు, స్టార్ కిడ్స్ మాత్రమే కాదు... బాలీవుడ్‌లో యంగ్ జనరేషన్ బ్యూటీస్ కూడా స్కిన్ షో విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఇష్టం లేకుండానే గ్లామర్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చా అంటున్న దిశా పటాని... హాట్ లుక్స్ విషయంలో కొత్త హైట్స్ చూపిస్తున్నారు. తెర మీద బికినీ షోతో రచ్చ చేసే ఈ భామ... సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లోనూ అదే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తున్నారు.
హీరోయిన్లు మాత్రమే కాదు ఐటమ్ గర్ల్స్ నోరా ఫతేహి, ఈషా గుప్తా కూడా గ్లామర్ షో విషయంలో నయా స్టైల్స్ ఫాలో అవుతున్నారు. ఇక సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావెద్ స్టైలింగ్ విషయంలో చేస్తున్న ప్రయోగాలు.. ఎప్పుడు హాట్ టాపికే.
ఫ్యాషన్ ఎక్స్‌పరిమెంట్స్ బాలీవుడ్ మాత్రమే ముందుంది అనుకుంటే పొరాపాటే. పాన్ ఇండియా మార్కెట్‌ను సౌత్ సినిమా రూల్ చేస్తున్నట్టే... పాన్ ఇండియా ఫ్యాషన్ వరల్డ్‌లో కూడా మన బ్యూటీస్ తమ మార్క్ చూపిస్తున్నారు.
ఆల్రెడీ నార్త్‌లో పాగా వేసిన పూజా హెగ్డే... స్టైలింగ్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నా రిస్కీ అనిపించే రేంజ్‌లో మాత్రం చేయటం లేదు. కానీ నేషనల్ క్రష్ రష్మిక మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. నిన్నగాక మొన్న మన శ్రీవల్లి రెడ్ హాట్ డ్రెస్‌లో చేసిన సందడి నార్త్ మీడియాను సర్ ప్రైజ్ చేసింది. బాలీవుడ్ లో బిజీ అవుతున్న రష్మిక... పబ్లిక్ అపియరెన్స్ విషయంలోనూ నార్త్ స్టైల్స్‌నే ఫాలో అవుతూ, బాలీవుడ్ రేంజ్‌కు తగ్గేదే లే అంటున్నారు.
బాలీవుడ్ డెబ్యూ విషయంలో సీరియస్ ట్రయల్స్‌లో ఉన్న సమంత కూడా స్టైలింగ్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఊ అంటావా అంటూ హోల్ ఇండియాను ఊపేసిన ఈ బ్యూటీ... రివీలింగ్ స్టైల్స్‌తో నార్త్ మీడియా కెమెరాలకు గట్టిగానే పని కల్పిస్తున్నారు.
హీరోయిన్‌గా ఇంకా క్రేజ్ రాకపోయినా... గ్లామర్ వరల్డ్‌లో మాత్రం హాట్ ఫేవరట్ అనిపించుకున్న బ్యూటీ మాళవికా మోహనన్. మాస్టర్ సినిమాతో హీరోయిన్‌గా టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక... గ్లామర్ దివా ఇమేజ్ విషయంలో ఆల్రెడీ స్కై హైలో ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ చేసే ఫోటో షూట్స్.. సోషల్ మీడియాలో ఇన్‌స్టాంట్‌గా వైరల్ అవుతుంటాయి.
హీరోయిన్స్‌గా జోరు తగ్గినా.. గ్లామర్ విషయంలో మాత్రం ఇంకా అదే రేంజ్ మెయిన్ టైన్ చేస్తున్న బ్యూటీస్ కూడా టాలీవుడ్‌లో గట్టిగానే కనిపిస్తున్నారు. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా లాంటి బ్యూటీస్ చేస్తున్న గ్లామర్ షో కూడా ఇంటర్నెట్‌లో ఫైర్ పుట్టిస్తోంది.
Priyanka Chopra , Janhvi Kapoor , Malaika Arora , Disha Patani , Nora Fatehi , Esha Gupta , Pooja Hegde , Samanta , Malavika Mohanan , Tamanna , Rakul Preet Singh