
ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది.. 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్‌కు తెర లేవనుంది. సెప్టెంబర్ 25న ఒకేరోజు బడా హీరోలిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి సై అంటే సై అంటున్నారు.

ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోడానికి మూన్నెళ్ల ముందే సెప్టెంబర్ 25 లాక్ చేసుకుంది అఖండ 2. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు భీభత్సంగా ఉన్నాయి.

అఖండ 2 బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. తాజాగా టీజర్‌లోనూ సెప్టెంబర్ 25 డేట్ మరోసారి లాక్ చేసారు.. దసరాకు తాండవం ఖాయం అంటున్నారు. మరోవైపు ఓజి కూడా 200 పర్సెంట్ దసరాకే వస్తుందని చెప్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ పోర్షన్ షూట్ అయిపోయింది.. మరో 4 రోజులైతే షూట్ కూడా మొత్తం అయిపోతుంది.

ఓజిపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదలైన రోజు నుంచే దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. దసరాకు సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తుంది ఓజి.

ఓజి, అఖండ 2.. ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు.. ఇటు ఓజి షూటింగ్ అయిపోయింది.. అటు అఖండ 2 కూడా రెడీ అవుతుంది. అయితే CG వర్క్స్ పరంగా చూసుకుంటే అఖండ 2కు ఇంకా చాలా వర్క్ పెండింగ్‌లో ఉంది. ఓజీ మాత్రం ఆన్‌టైమ్ వచ్చేలా కనిపిస్తుంది. మరి అవన్నీ త్వరగా పూర్తి చేసుకుని.. పవన్ని ఢీ కొట్టేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారా అనేది చూడాలి.