
తెలుగు చిత్రపరిశ్రమలోకి ఇప్పుడు కొత్త హీరోయిన్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పరభాష ముద్దుగుమ్మలు కథానాయికలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక మరికొందరు మాత్రం స్టార్ హోదా ఎంజాయ్ చేస్తున్నారు.

అనికా సురేంద్రన్. అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాలో బాలనటిగా కనిపించింది. ఇటీవలే ఈ అమ్మడు హీరోయిన్గా బుట్టబొమ్మ సినిమా రిలీజ్ అయ్యింది.

కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరీ ఈ అమ్మడుకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా చూడాలి.

ఇక ఆషికా రంగనాథ్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే విడుదలైన రోజు సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఆ తర్వాత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ఆషికా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మాత్రం మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

గౌరీ కిషన్.. 96 సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అదే సినిమా తెలుగులో జాను పేరుతో రిలీజ్ కాగా.. అందులోనూ గౌరీ నటించింది.

ఈ సినిమా తర్వాత గౌరీ తెలుగులో యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.