ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా రష్మి గౌతమ్ తన శైలిలో దూసుకుపోతూనే.. మరోవైపు వెండితెరపై కూడా తళుక్కుమంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ తనపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతుంటుంది.
తాజాగా ఓ నెటిజన్ రష్మి తీవ్రంగా బెదిరించాడు. ఆమెపై యాసిడ్‌పోస్తానంటూ.. చేతబడి చేయిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆమె ట్వీట్ చేసింది. ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయాలా అంటూ నెటిజన్ల సలహా కోరింది.
Rashmi Gautam
ఆమె ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఏకంగా ఆమెను బెదిరిస్తూ మెసేజ్‌లు కూడా పంపారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'నీ మీద చేతబడి చేయిస్తా. పాపిస్టిదానా. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లోనే ఉండు. నీ మీద యాసిడ్ పోస్తా..' అంటూ దారుణంగా తిట్టిపోస్తూ మెసేజ్ పెట్టారు.
'గతంలో ఈ నెటిజన్‌కు నా వయసు, పెళ్లి గురించి సమస్య ఉంది. ఇప్పుడు నాకు చేతబడి చేసి, యాసిడ్ పోయాలనుకుంటున్నాడు. నేనిప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలా..' అని రష్మి నెటిజన్ల సలహా కోరుతూ సదరు మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. దీంతో రష్మి తాజా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.