శివలీల గోపి తుల్వా |
Jan 21, 2023 | 8:02 AM
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పలు దేశాలకు చెందిన ప్రముఖులకు ఇలా గోల్డెన్ వీసా మంజూరు చేస్తుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. గోల్డెన్ వీసా పొందుతున్న ఫోటోను షేర్ చేసిన అల్లు అర్జున్.. దానిపై సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే యూఏఈ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు అల్లు అర్జున్. గోల్డెన్ వీసా పొందినందుకు అర్జున్‌కు పలువురు అభినందనలు తెలిపారు.
యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పలు దేశాలకు చెందిన ప్రముఖులకు ఇలా గోల్డెన్ వీసా మంజూరు చేస్తుంది. దీన్ని పొందిన వారు ఎటువంటి అనుమతి లేకుండా యూఏఈలో నివసించవచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారం కూడా చేసుకోవచ్చు.
ఇటీవల సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా సక్సెస్ వేవ్‌లో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్ . ఈ సినిమాతో ప్రపంచ ఖ్యాతి పొందిన స్టైలీష్ స్టార్ పాన్ ఇండియా స్టార్‌గా కూడా ఎదిగాడు.
‘పుష్ప:ది రైజ్’ సినిమాలో అల్లు అర్జున్, రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా నటించగా, సునీల్, అజయ్, అనసూయ తదితరులు కూడా ఇతర ముఖ్య పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే ‘పుష్ప: ది రూల్’ సినిమా పనులు ప్రారంభమయ్యాయి. అల్లు అర్జున్ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నాడు.