
అంతర్జాతీయంగా జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుకలో ఈసారి బాలీవుడ్ నుంచి ఆలియా భట్, ఈషా అంబానీ తోపాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాజరై సందడి చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించి దుస్తుల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోయారు.

మెట్ గాలా ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌లలో ఒకటి. బాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ స్టార్ అయిన అలియా భట్ కూడా ఈ ఏడాది మెట్ గాలాలో మెరిసింది. ఆలియా భట్ తెల్లటి స్లీవ్‌లెస్ గౌనులో తళుక్కుమన్నారు. మెట్ గాలాలో అలియా భట్ కనిపించటం ఇదే తొలిసారి.

ఆలియా ధరించిన తెల్లటి గౌను పగడపు ముత్యాలతో రూపొందిచారు. లుక్‌లో సింపుల్‌గా కనిపించే ఈ గౌను దాదాపు లక్ష పగడపు ముత్యాలతో తయారు చేశారు.

ఈ స్లీవ్‌లెస్, డీప్ నెక్, పొడవాటి రైలు గౌనులో అలియా పెళ్లికూతురులా కనిపించింది. డైమండ్ రింగ్‌లు, డైమండ్ చెవిపోగులు సెట్ చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్‌ఫెల్డ్‌కు నివాళిగా వజ్రాలు పొదిగిన ఫింగర్‌లెస్ గ్లోవ్‌లను కూడా స్టార్ ధరించారు. ఈ గౌను సూపర్ మోడల్ క్లాడియా షిఫెర్ 1992 చానెల్ బ్రైడల్ లుక్ నుండి ప్రేరణ పొందింది.

ఈ గౌనును నేపాల్ అమెరికన్ డిజైనర్ ప్రబార్ గురుంగ్ డిజైన్ చేశారు. ముంబైకి చెందిన అనైతా షరాఫ్ అదాజానియా అలియా స్టైలిస్ట్. ఆ చిత్రాలను స్వయంగా ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.