

రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్‌ను తెరకెక్కించాడు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్‌గా రిలీజైంది.

ఇప్పటివరకు రూ. 400 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో ఆదిపురుష్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి.

ఈక్రమంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదిపురుష్ యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (జూన్ 26) నుంచి మూవీ టికెట్ రేట్లను తగ్గించినట్లు తెలిపింది.

ఇందులో భాగంగా రూ. 112 కే 3D లో ఆదిపురుష్ సినిమాను వీక్షించవచ్చని మేకర్స్ తెలిపారు. మరి ఈ నిర్ణయంతో ఆదిపురుష్ కలెక్షన్లు పెరుగుతాయో లేదో చూడాలి.