Rajeev Rayala |
Jul 08, 2023 | 8:11 PM
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ అదా శర్మ.
ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కానీ అనుకున్న స్థాయిలో ఈ భామ రాణించలేకపోయింది.
ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
రీసెంట్ గా కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీవిజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది కేరళ స్టోరీ.
ఇక సోషల్ మీడియాలోనూ అదా శర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
చీరకట్టులో అదరగొట్టింది. చీరకట్టుకొని బైక్ పైకి ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.