
టాలీవుడ్ ఆడియన్స్ కు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్కు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సురభి. కానీ అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలోరాలేదు.యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ సురభి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. వరుసగా సినిమాలు చేసింది.

ఈ క్రమంలోనే 'ఎటాక్', 'జెంటిల్ మేన్', 'ఒక్క క్షణం', 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాల్లో నాని సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దాంతో ఈ అమ్మడికి మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు.

చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి.. సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయడం లేదు.

ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర. మరొకటి అల్లరి నరేష్ సినిమా. కాగా వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి భామ. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది.