
చదువు కోసం అయితే ఫర్లేదుగానీ, ఫ్యూచర్‌లో మాత్రం ఇంతింత గ్యాప్ తీసుకోకండి అని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ శ్రీలీల ఎంత బిజీగా ఉన్నారో, ఈ ఏడాది మీనాక్షి చౌదరి కూడా అంతే హెక్టిక్ షెడ్యూల్స్ చేశారు.

కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది శ్రీలీల. ఈ ఏడాది చివర్లో గుంటూరు కారం చిత్రంలో కనిపించిన శ్రీలీల ప్రస్తుతం.. పవన్ కళ్యాణ్ జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

అలాగే నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొన్న శ్రీలీల తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది. కొన్నాళ్లుగా ఆమె తన స్నేహితుడితో ప్రేమలో ఉందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే శ్రీలీల మాట్లాడుతూ.. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం చదువు, సినిమాలపైనే ఉందని తెలిపింది. చదువు మధ్యలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపింది.

అందుకే ముందుగా చదువు పూర్తి చేయాలని అనుకుంటున్నానని.. త్వరలోనే స్టడీ కంప్లీట్ చేసి ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ చేస్తానని తెలిపింది. ప్రస్తుతం తనకు ఖాళీ సమయం లేదని.. చదువు, నటన తప్ప మరో ఆలోచన లేదని చెప్పుకొచ్చింది.