
అందాల ముద్దుగుమ్మ శ్రియా శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ , తన హవా కొనసాగించింది. వరసగా స్టార్ హీరోల సరసన నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఇలా చాలా మంది హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఈ బ్యూటీ వివాహం చేసుకొని, కరోనా సమయంలో పాపకు జన్మనిచ్చింది. వివాహం, పాపకు జన్మనిచ్చిన తర్వాత ఈ నటి ఇండస్ట్రీకి దూరమైంది. కొంత కాలం పాటు తన ఫ్యామిలీకే సమయం కేటాయించి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపింది.

ఈ మధ్య కాలంలోనే సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి, మళ్లీ తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది. రీసెంట్‌గా మిరాయి సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా వైట్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి,