
మౌనీ రాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో చెప్పక్కర్లేదు. నిత్యం తన గ్లామరస్ ఫోటోలు, వెకేషన్ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఆమె, హఠాత్తుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకుముందే ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి ఉన్న అనేక ఫోటోలను డిలీట్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. సాధారణంగా సెలబ్రిటీల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు మొదట జరిగేది ఇదే కాబట్టి, వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి.

తాజాగా ఈ రూమర్స్ పై స్పందిస్తూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది మౌనీ రాయ్. ఆమె బుధవారం మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం ఆపాలని ప్రజలను కోరారు. “అన్ని మీడియా సంస్థలను తప్పుడు కథనాలను ప్రచురించవద్దని, మాకు ప్రైవసీ, గోప్యత ఇవ్వాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. దయచేసి” అని రాసి, దాని తర్వాత చేతులు జోడించిన ఎమోజీని పెట్టారు. సూరజ్, మౌని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారనే విషయం వెలుగులోకి రావడంతో రూమర్స్ మొదలయ్యాయి.

ఇక ఇప్పుడు మౌనీ రాయ్ రియాక్ట్ కావడంతో ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. మౌనీ రాయ్, దుబాయ్ కేంద్రంగా పనిచేసే వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను 2022, జనవరిలో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. మలయాళీ , బెంగాలీ సంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. పెళ్లయినప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ, తరచూ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసేవారు. అయితే, గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనిపించకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం విడాకుల వల్లే ఆమె ఇలా చేసిందా? లేక తన ఖాతా హ్యాక్ అయిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, భర్త ఫోటోలు తొలగించడం అనేది వ్యక్తిగత విభేదాలు, డివోర్స్ రూమర్స్ ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేశాయి. మౌనీ రాయ్ వివరణతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

ప్రస్తుతం మౌనీ రాయ్ తన కెరీర్‌పై దృష్టి పెడుతూనే, తన వైవాహిక జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. మౌనీ రాయ్ భారతీయ చలనచిత్ర , టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బుల్లితెరపై 'నాగిని'గా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. 2006లో ఏక్తా కపూర్ నిర్మించిన 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఇందులో కృష్ణ తులసి పాత్రలో నటించి మెప్పించారు. మౌనీ రాయ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సీరియల్ నాగిన్.