
కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న మృణాళిని రవి తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర, లవ్ గురు తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే తన కష్టార్జితంతో బెంగళూరులో ఒక లగ్జరీ ఇల్లును కొనేసింది మృణాళిని రవి. తాజాగా గృహప్రవేశం కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించింది

ఈ కార్యక్రమానికి మృణాళిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ మేరకు ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మృణాళిని.

'చిన్నప్పుడు నాన్న ఇల్లు కట్టి దానికి తన తల్లి పేరు పెట్టాడు. అప్పుడది చూసి నేను కూడా పెద్దయ్యాక ఇలాగే ఓ పెద్ద ఇల్లు కొట్టి దానికి మా అమ్మ పేరు (మోళి) పెట్టాలనుకున్నాను'

ఎట్టకేలకు నా చిన్ననాటి కల సాకారమైంది. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ఎప్పుటికీ రుణ పడి ఉంటాను' అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది మృణాళిని రవి.