
బాలనటిగా వెండితెరపై సీనిరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత టాప్ హీరోయిన్గా ఎదిగారు మీనా. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించింది.

దాదాపు మూడు దశాబ్దాలపాటు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న సమయంలోనే వ్యాపారవేత్తగా విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. అయితే 2022లో మీనా భర్త అనారోగ్య సమస్యలతో మరణించారు.

అయితే చాలాకాలంగా మీనా రెండో పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పటికే వీటిపై అనేకసార్లు క్లారిటీ ఇచ్చింది మీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. మరోసారి సెకండ్ మ్యారేజ్ రూమర్స్ పై స్పందించింది.

డబ్బు కోసం.. సెన్సెషన్ కావడానికి ఏమైనా రాసేస్తారా ?.. సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. నిజాలు తెలుసుకోని రాయాలని.. అలా వాస్తవాలు తెలుకుని రాస్తే అందరికి మంచిందని అన్నారు. దేశంలో తనలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారని అన్నారు.

తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి రాయాలని.. ప్రస్తుతం రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాలు