ప్రముఖ నటి కస్తూరి మహా కుంభమేళాను దర్శించుకుంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన ఆమె అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.