
కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆకుపచ్చ చందమామలా చీరలో మంత్రముగ్దులను చేస్తోంది ఈ కోలీవుడ్ బ్యూటీ. తెలుగులో హలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అఖిల్ హీరోగా కనిపించాడు.

ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు అవకాశాలు రాలేదు.

కళ్యాణి ప్రియదర్శన్ కోలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్.. నటి లిస్సి దంపతుల కుమార్తె. 1993 ఏప్రిల్ 5న జన్మించింది. న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసింది.

తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కళ్యాణి.