
పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పుడు తన బిడ్డ పెంపకంలోనే ఎక్కువగా బిజీగా ఉంటోందీ అందాల తార.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన కుమారుడి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

తాజాగా తన కుమారుడి నీల్ కిచ్లూ ప్రీ స్కూల్ ముగిసిందంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది కాజల్ అగర్వాల్. ఈ స్కూల్‌ను నీల్‌తో పాటు తల్లిదండ్రులుగా తాము కూడా మిస్ అవుతామంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది

ఈ సందర్భంగా ప్లే స్కూల్‌లో తన కుమారుడు ఆడుతూ, పాడుతూ ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇందులో కాజల్, భర్త గౌతమ్ కిచ్లూ, కుమారుడు నీల్ కిచ్లూ లు ఎంతో క్యూట్ గా కనిపించారు. కాగా 2020 అక్టోబర్ 30న కాజల్- గౌతమ్ పెళ్లి జరిగింది. పెళ్ళైన రెండేళ్లకు వీరికి బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బాబుకి ఇప్పుడు నాలుగేళ్లు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా భక్త కన్నప్ప సినిమాలో పార్వతిగా కనిపించింది కాజల్ అగర్వాల్. దీని తర్వాతి సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.