ప్రముఖ తమిళ నటి గాబ్రియెల్లా- ఆకాశ్ దంపతులు త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. తాజాగా గాబ్రియెల్లా సీమంతం వేడుక గ్రాండ్ గా జరిగింది.
ఈ మేరకు తన సీమంతం లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది గాబ్రియెల్లా. దీనికి బేబీషవర్ అన్న క్యాప్షన్ జోడించింది
గాబ్రియెల్లా.. సుందరి సీరియల్‌లో సుందరిదేవిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది.
రజనీకాంత్ నటించిన కబాలిలో అతిథి పాత్రలో మెరిసింది గాబ్రియెల్లా. అలాగే కాంచన 3, కట్టుమారం, N4, ఐరా తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ మెప్పించింది.
ప్రస్తుతం గాబ్రియెల్లా సీమంతం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు గాబ్రియెల్లా- ఆకాశ్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.