పదిహేనేళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసింది పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్. నీతోడు కావాలంటూ అంటూ తెలుగు ప్రేక్షకులను తన అభినయంతో ఆకట్టుకుంది... ఆ తర్వాత ఆడపులి.. సివంగి అంటూ శ్రీఆంజనేయం సినిమాలో రౌడీ అమ్మాయిగా మెప్పించింది.. మే 17న పుట్టినరోజు .. ఆమె గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా..

ఆ తర్వాత కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రాల్లో నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో వెంటనే ఆమెకు కాదల్ అళివతిల్లై... ఆహా, ఎత్న అళగు అనే తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయంతో తెలుగులో ఫస్ట్ హిట్ కొట్టింది. అందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.

మాస్ మూవీలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రభాస్ తో చక్రం మూవీ చేసిన ఛార్మి.. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజులో అద్భుతంగా నటించింది.

మంగళ మూవీలో తన నటనకు ఛార్మికి నంది అవార్డు దక్కింది. తర్వాత బాపు కన్నుల్లో పడ్డ ఈ చిన్నది.. అచ్చమైన తెలుగమ్మాయిలా సుందరకాండ మూవీలో నటించి మెప్పించింది.

జ్యోతిలక్ష్మీ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ లో వరుసగా మూవీస్ చేస్తుంది.

జ్యోతిలక్ష్మీ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ లో వరుసగా మూవీస్ చేస్తుంది.