
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనిఖా సురేంద్రన్. కోలీవుడ్ స్టార్ అజిత్, నయనతార జంటగా నటించిన విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా నటించి ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమాతో తమిళ్, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నవంబర్ 27న అనిఖా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ బ్యూటీకి సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అయితే ప్రస్తుతం కథానాయికగా నటించేందుకు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది అనిఖా. ఈ క్రమంలోనే నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.

అనిఖా 2004లో కేరళలోని మంజేరి ప్రాంతంలో జన్మించింది. బాలనటిగా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అనిఖా.. చివరిసారిగా అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలో కనిపించింది. ఇందులో నాగ్ మేనకోడలిగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అనిఖా లేటేస్ట్ ఫోటోస్ చూస్తే టాప్ హీరోయిన్లకు పోటీరావడం ఖాయంగా తెలుస్తోంది.