
అమలా పాల్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఈ అమ్మడు ఎక్కువగా తమిళం, మలయాళం, తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1991 అక్టోబర్ 26న కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. అమలాపాల్ అసలు పేరు అనఖ.

అమలా పాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత తమిళ చిత్రం మైనా (2010) ఆమెకు తమిళనాడు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టింది. తెలుగులో బెజవాడ (2011)తో ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్.

ఇద్దరమ్మాయిలతో, నాయక్, వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ రన్ బేబీ రన్ (2012), ఒరు ఇండియన్ ప్రణయకథ (2013) చిత్రాలకు SIIMA అవార్డులు, మిలి (2015)కి ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది.

ఇటీవల ది గోట్ లైఫ్ (2024)లో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక అమల పాల్ 2014లో దర్శకుడు ఏ.ఎల్. విజయ్‌ను వివాహం చేసుకుని, 2017లో విడాకులు తీసుకుంది. 2023 నవంబర్‌లో జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది.

అమలా పాల్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులతో తన వ్యక్తిగత, వృత్తి జీవిత విశేషాలను పంచుకుంటుంది. 2024 అక్టోబర్‌లో తన 33వ పుట్టినరోజును బాలిలో జరుపుకుంది. ఆమె గ్లామర్, బోల్డ్ లుక్‌లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తల్లిగా, భార్యగా తన జీవితాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చింది.