
టాలీవుడ్ హీరోయిన్ అభినయ ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఏప్రిల్ 16న తన బాల్య స్నేహితుడు కార్తీక్ తో కలిసి ఏడడుగులు వేసింది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అభినయ, కార్తీక్ ల వివాహ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. సముద్రఖని, శివ కుమార్, అశ్విన్ తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై కొత్త దంపతులకు అభినందనలు తెలిపారు.

పెళ్లి తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న అభినయ ఇప్పుడు భర్తతో కలిసి లండన్ లో విహరిస్తోంది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది.

తమ హనీమూన్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది అభినయ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతన్నాయి.

అభినయ- కార్తీక్ ల ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'బ్యూటిఫుల్ కపుల్, 'జంట చాలా బాగుంది' అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.