
బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్స్‌పై సినిమాలు వస్తూనే ఉన్నాయి. పేరొందిన సెలబ్రిటీలు సైతం గ్యాంగ్‌స్టర్స్‌గా నటించి మెప్పించారు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్స్‌పై వెబ్ సిరీస్‌లు కూడా రూపొందుతున్నాయి. షారుఖ్‌ఖాన్ నుంచి అజయ్ దేవగన్ వరకు ఈ లిస్ట్‌లో ఉన్నారు. షారుక్ ఖాన్ 2017 చిత్రం రయీస్‌లో అబ్దుల్ లతీఫ్ పాత్రను పోషించారు. అతను గుజరాత్‌లో అక్రమ మద్యం వ్యాపారం చేసేవాడు.

అజయ్ దేవగన్ 2010లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై చిత్రంలో గ్యాంగ్‌స్టర్ హాజీ మస్తాన్ పాత్రను పోషించాడు. అతన్ని సుల్తాన్ మీర్జా అని కూడా పిలుస్తారు. స్మగ్లింగ్‌లో ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.

2007లో షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా చిత్రంలో వివేక్ ఒబెరాయ్ మాయ డోలాస్ పాత్రను పోషించారు. ఇతను దావూద్ ఇబ్రహీం వద్ద పనిచేసిన అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్. 1991లో తన 25వ ఏట లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు.

వినోద్ ఖన్నా 1988లోని దయవాన్‌లో శక్తి వేలు పాత్రను పోషించారు. ఆయన పూర్తి పేరు వరదరాజన్ ముదలియారి. అయన తమిళనాడుకు చెందినవారు. 1987లో, మణిరత్నం ఆయన జీవితకథతో నాయకన్ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కమల్ హాసన్ హీరో.

శ్రద్ధా కపూర్ సైతం సిల్వర్ స్ర్కీన్‌పై దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ పాత్రను కూడా పోషించింది. ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయం సాధించింది.

జాన్ అబ్రహం 2013లో విడుదలైన షూటౌట్ ఎట్ వడాలా చిత్రంలో మాన్య సర్వే పాత్రను పోషించాడు. అతను చదువుకున్న గ్యాంగ్‌స్టర్. అతను క్రైమ్ ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాడనేది సినిమాలో చూపించారు. 37 సంవత్సరాల వయస్సులో మాన్య పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

అర్జున్ రాంపాల్ 2017లో విడుదలైన డాడీ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త అరుణ్ గావ్లీ పాత్రను పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్‌గా నిలిచింది.