
ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్.. తరువాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్‌లోనూ రూపొంది సక్సెస్ అయ్యింది.

దృశ్యం తొలి సినిమా రిలీజ్ అయి పదేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆ సినిమా సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం.

అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది.. అనే పాయింట్‌ను థ్రిల్లింగ్ రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్.

దృశ్యం మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించటంతో తరువాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయ్యింది.

చైనీస్, ఇండోనేషియా, సింహాల భాషల్లో దృశ్యం ఫస్ట్ పార్ట్ రీమేక్ అయ్యింది. తొలి భాగానికి అద్భుతమైన రెస్పాన్స్ రావటంతో దృశ్యం సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేశారు మలయాళ మేకర్స్.

ఏడేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం 2, సక్సెస్ సౌండ్‌ను రిపీట్ చేసింది. దీంతో మళ్లీ అన్ని భాషల్లో దృశ్యం 2 కూడా రీమేక్ అయ్యి సక్సెస్ అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దృశ్యం సాధించిన రికార్డ్‌లను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు దృశ్యం 3తో ఈ సిరీస్‌కు ముంగిపు పలుకుతామని మేకర్స్ ఎనౌన్స్ చేయటంతో త్రీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఏదైనా వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.