కాలేయ సమస్యలను తగ్గించే చింత చిగురు కోడిగుడ్ల కూర.. మరి, ఎలా చేయాలంటే?

Updated on: May 13, 2026 | 6:30 AM

Chintha Chiguru Egg Curry : కాలేయ సమస్యలను చెక్ పెట్టే చింత చిగురు కోడిగుడ్ల కూర ఇలా వండుకుని తినాల్సిందే. ఈ కూరను ఆంధ్రా , తెలంగాణలో బాగా తింటారు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్దాలు :  4 గుడ్లు, రెండు కప్పుల చింత చిగురు, మూడు ఉల్లిపాయలు,  రెండు టమాటాలు,  నాలుగు పచ్చిమిర్చి 4,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం,  అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 10 కరివేపాకు,   కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్స్  నూనె, రుచికి సరిపడా  ఉప్పును తీసుకోవాలి.

2 / 5
గుడ్లను ఇలా ఉడికించుకోవాలి : ముందుగా కోడి గుడ్లను తీసుకుని వాటిని బాగా ఉడికించి పొట్టు కూడా తీసి పక్కన  పెట్టుకోవాలి. ఇంకా పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయిన తర్వాత  అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఆకులు కుడా దీనిలో వేసి బాగా వేయించుకోవాలి.

3 / 5
ఉల్లిపాయ మిశ్రమాన్నిఇలా వేయించుకోవాలి : ఆ తర్వాత ఈ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు ,  నాలుగు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.  ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని బాగా వేయించుకోవాలి.

4 / 5
ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీనిలో రెండు టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు  వీటిని బాగా ఉడికించాలి.  ఇవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా డైనిలో వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

5 / 5
ఇక చివర్లో మొత్తం ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి 10 నిమిషాల పాటు మూతపెట్టి వీటిని  బాగా ఉడికించాలి. అయితే, చిగురు మెత్తబడితే టేస్ట్ మంచిగా ఉంటుంది.  ఉడికించిన ఈ గుడ్లను కూరలో వేసి  కొద్దిగా నీళ్లు వేసి 10 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇంకా దీనిలో  కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్  చేసి కిందకు దించి వడ్డీంచుకుని తినడమే.

Follow Us