
కాగా, ఇప్పుడు మనం చేపలు వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. చేపలు అరకేజీ, కారం, వెల్లుల్లి రెబ్బలు కప్పు, ఉప్పు,గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, మిరియాల పొడి చిటికెడు.

ముందుగా చేపలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో పసుపు, ఉప్పు , కొంచెం నూనె వేసి, చేపలును నీచు వాసన రాకుండా మంచిగా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, గరం మాసాలా , మిరియాల పొడి, ధనియాల పొడి, చిటికెడు పసుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయాలి. తర్వాత కచ్చ పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. కొంచెం ఆయిల్ వేసి ఆ మిశ్రమాన్ని చాలా మంచిగా అన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న చేపలు తీసుకోవాలి. ప్రతి చేపలకు ఈ కారం మసాలా మిశ్రమం మంచిగా అంటించుకోవాలి. చేప నిండుగా కారం మాసాలా మిశ్రమాన్ని పూయాలి.ఇలా ప్రతి చేపకు కారం మంచిగా అట్టించి, పైన వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి.

అన్నీ చేపలకు మంచిగా కారం పట్టించిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసి, నూనె బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో చేపలు వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పక్కన ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చేపలు వెల్లుల్లి కారం ఫ్రై రెడీ.