
Chanakya Niti about women: ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని.. అలా చేస్తే మోసపోవడం ఖాయమని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే.. ఎవరి జీవితంలోనైనా ఒక మహిళకు ప్రత్యేక స్థానం ఉంటుందని.. ఆమెను నమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది రానివ్వదని పేర్కొన్నాడు. అందుకే మహిళను సులభంగా నమ్మవచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకా స్త్రీల గురించి ఆచార్యుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు.. ప్రపంచంలో ఎవరినైనా.. ఒక స్త్రీని మాత్రమే గుడ్డిగా విశ్వసించగలదని.. అది అతని తల్లి అని పేర్కొన్నాడు. తల్లి తన బిడ్డకు ఎప్పుడూ హాని చేయదు. ఇతరుల పట్ల ఆమె మనసులో అసూయను ఎంతగా ఉంచుకున్నా, ఎప్పుడూ తన పిల్లల మంచినే కోరుకుంటుంది. తన చివరి శ్వాస వరకు అతన్ని ప్రేమిస్తుంది.. అన్ని కష్టాల నుంచి అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది.

కుటుంబానికి ఆధారం మహిళ అని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. కావున సమాజంలో స్త్రీ విద్యను పొందడం చాలా ముఖ్యమని తెలిపాడు. చదువుకున్న స్త్రీ మీ తరాలలో చాలా మందికి విద్యాబుద్ధులు నేర్పుతుంది.. అంతేకాకుండా వంశాన్ని కాపాడుతుందని అభిప్రాయపడ్డాడు చాణుక్యుడు.

స్త్రీ అందం కంటే ఆమె గుణాలు.. విలువలు ముఖ్యమని ఆచార్య విశ్వసించాడు. సత్ప్రవర్తన గల మహిళ ఎక్కడ నివసించినా, ఆమె అన్నిటినీ చక్కదిద్దుతుందన్నాడు. అందుకే స్త్రీ అందానికి బదులు ఆమె గుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు.

స్త్రీ ఎవరినైనా ప్రేమిస్తే.. ఆమె చాలా చేస్తుందన్నాడు. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుందని ఆచార్యుడు పేర్కొన్నాడు. అందువల్ల.. ఎవరైనా మహిళ మమ్మిల్ని ప్రేమిస్తున్నా, ఆదరిస్తున్నా.. అలాంటి వారి సహవాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదని పేర్కొన్నాడు.

భవిష్యత్తులో.. అలాంటి మహిళలతో పొరపచ్చాలు వచ్చినా.. వారిని ఒప్పించేందుకు మనమే వెనకడుగు వేయాలని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఓ మహిళ ప్రేమను అర్ధం చేసుకుంటే.. చివరి వరకు వారి స్నేహాన్ని విడిచిపెట్టొద్దని.. వారు కూడా మంచినే కోరుకుంటారని తెలిపాడు.