Butter Vs Cheese: బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్.. నిపుణుల సలహా ఇదే

Updated on: Nov 02, 2026 | 11:33 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని జిమ్‌కు వెళ్లడం, డైట్స్‌ ఫాలో అవ్వడం చేస్తున్నారు. ఇలా డైట్ చేసే చాలా మంది చీజ్‌, బటర్‌ను తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. అయితే డైట్‌లో ఉన్న వారికి ఈ రెండింటిలో ఏది ఆరోగ్య వంతమైంది. వీటిలో ఎలాంటి పోషకాలు ఉంటాయి. నిపుణుల ఇచ్చే సలహా ఏంటో ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.

1 / 5
బరువు తగ్గాలి అనుకునేవారు, జిమ్‌కు వెళ్తూ డైట్‌ ఫాలో అయ్యే చాలా మందికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చాలా వరకు తెలియదు.ముఖ్యంగా, బ్రెడ్, శాండ్‌విచ్‌లతో సహా అనేక ఆహార పదార్థాలలో ఉపయోగించే వెన్న, జున్నులలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కాబట్టి, పోషకాల పరంగా మనకు ఏది బెస్ట్.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

2 / 5
వెన్న: వెన్న ఇందులో సంతృప్తి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, అవసరమైన ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి.మీరు వెన్న ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు.

3 / 5
చీజ్‌: మరోవైపు, జున్నులో సంతృప్త కొవ్వుతో పాటు నాణ్యమైన ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, కండరాల నిర్వహణకు హెల్ప్‌ చేస్తాయి. కొన్ని రకాల జున్నులో పులియబెట్టే ప్రక్రియలో ఏర్పడిన బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. అయితే, కొన్ని రకాల జున్నులో సంతృప్త కొవ్వుతో పాటు ఉప్పు కూడా అధికంగా ఉండవచ్చు. కాబట్టి అన్ని రకాల జున్నులు ఆరోగ్యానికి సమానంగా ప్రయోజనకరమని చెప్పలేము.

4 / 5
 వెన్న, జున్ను రెండూ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. వాటిని లిమిట్‌లో తీసుకోవడం మంచిది. ఉదాహరణకు ఒక ఆరోగ్యంగా వ్యక్తి ఒక రోజు మొత్తంలో తీసుకునే ఆహారాన్ని దృష్టిలో ఉంచుకుని, వెన్న లేదా జున్నును పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. ఒక చిన్న జున్ను ముక్క (20 నుండి 25 గ్రాములు) ఒక ఎంపికగా ఉంటుంది. అయితే, ఈ పరిమాణం వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది.

5 / 5
మీరు బరువు తగ్గాలని చూస్తుంటే వెన్న లేదా జున్నుకు బదులుగా, మీరు మీ రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను చేర్చుకోవాలి. మొత్తం మీద, పోషక విలువల పరంగా వెన్న కంటే జున్ను మంచి ఎంపిక కావచ్చు. కానీ రెండింటినీ అతిగా తినడం మంచిది కాదు.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us