Gold History: బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లోనే ఎందుకిస్తారు..? దీని వెనుక ఉన్న అసలు చరిత్ర తెలిస్తే వావ్ అంటారు

Updated on: Feb 06, 2026 | 8:14 AM

బంగారం కొనుగోలు చేసినప్పుడు షాపుల యాజమానులు పింక్ కలర్‌ పేపర్‌లో అందించడం మనం చూస్తే ఉంటుంది. దీంతో చాలామందికి అనుమానం ఉంటుంది. పింక్ కలర్ పేపర్‌నే బంగారం షాపుల్లో ఎందుకు వాడతారనే ప్రశ్న వస్తూ ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణాలు చూద్దాం.

1 / 5
మీరు బంగారం షాపుకు ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. గోల్డ్ షాపుల్లో బంగారాన్ని పింక్ పేపర్‌లో పెట్టి మీకు చూపించడం లేదా కొనుగోలు చేసిన తర్వాత అదే కలర్ పేపర్‌లో బంగారం చుట్టి ఇవ్వడం లాంటివి చూసి ఉంటారు. దీంతో పింక్ పేపర్‌లోనే ఎందుకు ఇస్తారు అనే అనుమానం అందరికీ ఉంటుంది. వేరే కలర్ పేపర్ ఎందుకు వాడరనే ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది.

2 / 5
భారతీయులకు సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక కోణంతో కూడా బంగారాన్ని చూస్తారు. సంపదకు, శుభానికి ప్రతీకగా భారతీయులు బంగారాన్ని భావిస్తారు. దీనిని ఒక ఆభరణంగా కాకుండా ఆస్తిగా భావిస్తారు. దీంతో అత్యంత విలువైన వస్తువు అందించేటప్పుడు ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో పింక్ కలర్‌ పేపర్‌లో చుట్టి అందిస్తారు.

3 / 5
పింక్ కలర్ ఎందుకు వాడతారంటే.. ఆ కలర్‌ను శుభ్రత, మృదుత్వం, సౌమ్యతకు ప్రతీకగా భారతీయులు భావిస్తారు. అంటే.. ఆ కలర్ చూడగానే మనస్సులో ప్రశాంతత, సానుకూల భావన ఏర్పడుతుంది. ఇక బంగారాన్ని పింక్ పేపర్ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో కస్టమర్లకు కూడా కళ్లకు అహ్లాదంగా కనిపించడం వల్ల విలువైన వస్తువు కొనుగోలు చేశామనే భావన ఏర్పడుతుంది.

4 / 5
భారతీయులు సంప్రదాయాలను బాగా పాటిస్తారు. ఎప్పటినుంచో బంగారాన్ని పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం అలవాటు అయింది. దీంతో తరతరాలుగా అది కొనసాగుతూ వస్తోంది. ఇక పింక్ పేపర్‌కు మురికి, మడతలు పడినా త్వరగా కనిపించదు. అలాగే గోల్డ్ అందించేటప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలనే కారణంతో షాపుల యజమానులు పింక్ పేపర్‌లో అందిస్తారు.

5 / 5
ఇక పింక్ కలర్‌ను శుభంగా భావిస్తారు. దీంతో కొనుగోలు చేసినవారికి శుభం జరగాలనే ఉద్దేశతో షాపుల యజమానులు పింక్ కలర్ పేపర్‌లో అందిస్తారు. దీంతో తరతరాలుగా ఇదే ఆచారం కొనసాగుతూ వస్తోంది. దీంతో గోల్డ్ అనగానే పింక్ కలర్ పేపర్ అందరికీ గుర్తొస్తుంది.