Upcoming Cars: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానున్న సరికొత్త కార్లు ఇవే..

Updated on: Apr 01, 2023 | 12:55 PM

దేశంలో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో పలు కంపెనీల నుంచి కొత్త కార్లు మార్కెట్లోకి రాన్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను కార్లను పొందించాయి కంపెనీలు. ఈ కొత్త కార్ల ధరలు, ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

1 / 5
Maruti Suzuki Fronx: కంపెనీ ఈ కారును ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయవచ్చు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కారును ప్రవేశపెట్టారు. ఈ కారు బుకింగ్ ప్రారంభమైంది. కంపెనీ ఇప్పటివరకు 15,000 కార్ల బుకింగ్‌లను పొందింది. ఈ కారులో 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్, కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి.

2 / 5
Toyota Innova Crysta Diesel: టొయోటా తన తదుపరి తరం ఎమ్‌పివిని ఇన్నోవా హిక్రాస్ రూపంలో గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసింది. మరోవైపు, కంపెనీ డీజిల్‌తో నడిచే ఇన్నోవా క్రిస్టాను భారతదేశంలో తిరిగి ప్రవేశపెట్టనుంది. ఈ కారు బుకింగ్ జనవరి 2023లో ప్రారంభమైంది. టొయోటా వచ్చే నెలలో క్రిస్టా డీజిల్ మోడల్‌ను భారత మార్కెట్‌లో రీలాంచ్ చేసే అవకాశం ఉంది.

3 / 5
MG Comet EV: MG మోటార్ ఏప్రిల్‌లో కామెట్ EVని భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. కామెట్ EV పూర్తి ఛార్జ్‌తో దాదాపు 300 కి.మీ మైలేజీ ఇవ్వగలదు. భారతదేశంలో దీని అంచనా ధర రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చు.

4 / 5
Mercedes-AMG GT 63 SE: Mercedes-Benz ఏప్రిల్ 11న భారతదేశంలో AMG మోడల్‌ను ప్రారంభించవచ్చు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ పవర్‌హౌస్‌కి ఎలక్ట్రిక్ మోటార్ జోడించబడింది. ఈ ఇంజన్ 843bhp పవర్ అవుట్‌పుట్, 1400Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

5 / 5
Lamborghini Urus S: ఈ కారు ఉరుస్ పెర్ఫార్మంటే మోడల్‌ను ఏప్రిల్ 13న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. SUV 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 657bhp, 850Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.