
Toyota Innova Zenix: టయోటా తన కొత్త ప్రీమియం ఎమ్‌పివి టొయోటా ఇన్నోవా జెనిక్స్‌ను కస్టమర్ల కోసం ముందుగా మలేషియాలో విడుదల చేసింది. ఇటీవలే లాంచ్ అయిన ఈ కార్‌లో ఎన్నో రకాల సేఫ్‌టీ ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ఇన్నోవా జెనిక్స్ పెట్రోల్ వేరియంట్ 8 సీటింగ్‌లను కలిగి ఉండగా, MPV హైబ్రిడ్ వేరియంట్‌లో 7 సీటింగ్ ఎంపిక ఉంది. ఈ కారులో 2.0 లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. అయితే ఇందులో CVT, e-CVT మోడల్స్ మాత్రమే ఉన్నాయి.

టయోటా ఇన్నోవా జెనిక్స్ హైబ్రిడ్ వేరియంట్‌లో పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, ADAS సపోర్ట్ వంటి అద్భుత ఫీచర్లు కూడా ఉన్నాయి.

అంతేకాక టయాటా కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కారులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉండడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

ధర విషయానికి వస్తే టయోటా ఇన్నోవా జెనిక్స్ ప్రీమియం ఎమ్‌పీవీ ధర 165,000 మలేషియా రింగిట్. అంటే మన దేశంలో సుమారుగా రూ. 28 లక్షల 96 వేలుగా ఉండే అవకాశం ఉంది.