
హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ అధునాతన ట్యాంక్ ఎక్స్‌టెన్షన్లతో ఉంటుంది. ముఖ్యంగా స్టైలిష్ ఎల్ఈడీ లైటింగ్ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ 124.7 సీసీ ఇంజిన్ ఈ బైక్ ప్రత్యేకత. ఈ బైక్ 11.4 హెచ్‌పీ, 10.5 ఎన్ఎం టార్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ. 96,425 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హెూండా ఎస్‌పీ-125 బైక్ స్పోర్టీ డిజైన్, చక్కని గ్రాఫిక్స్, క్రిస్పీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ 10.9 పీఎస్, 10.9 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 123.94 సీసీ ఇంజిన్ ఈ బైక్ ప్రత్యేకత. అలానే ఈ బైక్ ధర రూ. 92,678 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్-125 బైక్ కాలేజీకి వెళ్లే విద్యార్థులకు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. రేసింగ్ లుక్‌తో పెరిమీటర్ ఫ్రేమ్, అగ్రెసివ్ బాడీవర్క్ ఆకట్టుకుంటాయి. 124.45 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 11.99 పీఎస్, 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ. 99,994 (ఎక్స్-షోరూమ్) ధర నుంచి అందుబాటులో ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్-125 సూపర్ స్టైలిష్ లుక్‌తో వస్తుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఎడ్జీ ఇంధన ట్యాంక్ వంటివి బైక్ లుక్‌ను ప్రీమియంగా చేస్తుంది. ఈ బైక్ 11.8 హెచ్‌పీ, 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 124.58 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్పై నడుస్తుంది. ఈ బైక్ ధర దాదాపు రూ. 93,158 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.

టీవీఎస్ రైడర్ 125 కమ్యూటర్ బైక్ గ్రామీణ ప్రాంత ప్రజలను ఆకర్షిస్తుంది. ఫంకీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, షార్ప్ బాడీ లైన్స్, డిజిటల్ డిస్ప్లే, సీటు కింద స్టోరేజీ ఫెసిలిటీలు అందుబాటులో ఉన్నాయి. 124.8 సీసీ ఇంజిన్ ద్వారా వచ్చే ఈ బైక్ 11.22 హెచ్‌పీ, 11.75 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల రోజువారీ రైడ్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 87,010 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.