
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంట్లో పిండి వంటలు, నాన్ వెజ్ వంటకాలు వడుకుంటూ ఉంటారు. దీంతో ఇంట్లోకి అవసరమయ్యే కూరగాయలను ముందే తెచ్చి పెట్టుకుంటున్నారు. దీంతో పండుగ వేళ రైతు బజార్లు, సూపర్ మార్కెట్లకు కస్టమర్ల రద్దీ పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్‌లో టమాటా ధర భారీగా తగ్గి పండగ వేళ ప్రజలకు ఊరట కలిగించింది. ఏ కూర వండుకోవాలన్నా టామాటాలు అవసరమే. దాదాపు అన్నీ కూరల్లోకి టామాటో ఉపయోగిస్తారు. దీంతో వంటింట్లో ఎప్పుడూ టామాటాలు ఉండాల్సిందే. మొన్నటివరు ఏకంగా కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలికిన టమాటాలు ప్రస్తుతం తగ్గాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ టమాటా రూ.21కు లభిస్తోంది. కూకట్‌పల్లి రైతు బజార్‌లో కిలో టమాటా రూ.21గా ఉండగా.. వంకాయ రూ.18, బెండకాయ రూ.40గా ఉంది. ఇక పచ్చిమిర్చి కేజీ రూ.40, బజ్జిమిర్చి రూ.40, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.38గా ఉంది.

ఇక కిలో క్యాబేజీ రూ.13, బీన్స్ రూ.40, క్యారెట్ రూ.27, గోబిపువ్వు రూ.25. దొండకాయ రూ.40, చిక్కుడుకాయ రూ.35, బీట్ రూట్ రూ.18, క్యాప్సికం రూ.35గా ఉంది. అటు ఆలుగడ్డ కేజీ రూ.10, కీర రూ.18, ఉల్లిగడ్డ రూ.22, మునగకాయలు రూ.15గా ఉంది

ఇక అల్లం కేజీ రూ.100, వెల్లుల్లి రూ.240, చింతపండు రూ.200, కరివేపాకు రూ.120గా ఉంది. అలాగే పల్లికాయ కిలో రూ.70, ఉసిరి రూ.60, పండుమిర్చి రూ.80, ఎండుమిర్చి రూ.220 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.