హీరో ప్లెజర్ ప్లస్.. ఈ స్కూటర్ సీట్ ఎత్తు 765ఎంఎం. దీని ధర రూ. 68,368 ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఈ ప్లెజర్ ప్లస్ స్కూటర్లో 110.9సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. దీనిలోని మోటార్ 7.9 బీహెచ్‌పీ, 8.7 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది సీవీటీతో జత చేసి ఉంటుంది.