Expensive Motorcycles: దేశంలోని అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే.. ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు..

|

Sep 11, 2024 | 7:22 PM

సాధారణంగా మోటారు సైకిళ్లను కొనుగోలు చేయడానికి మనం ఎంత బడ్జెట్ కేటాయిస్తాం. సామాన్యులు అయితే రూ. ఒక లక్ష, కొంచెం ఉన్నత కుటుంబాల వారు దాదాపు రూ.2 లక్షల వరకూ ఖర్చుపెడతారు. కానీ కార్ల కంటే ఖరీదైన మోటారు సైకిళ్ల మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటికి పెట్టే డబ్బులతో నాలుగైదు కార్లు కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ కూడా బాగా ఎక్కువగా ఉండడం విశేషం. వాటి ధరకు అనుగుణంగానే వీటిలో సూపర్ పనితీరు, టెక్నాలజీ, వేగం, నాణ్యత ఉంటాయి. ప్రయాణంలో అత్యధ్బుత అనుభవాన్ని కలిగిస్తాయి. భారతీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటారు సైకిళ్లు ఇవే..

1 / 5
కవాసకి నింజా హెచ్2ఆర్.. కవాసకి నింజా హెచ్2ఆర్ అనేది ట్రాక్-ఓన్లీ మోటార్‌సైకిల్. దీన్ని పబ్లిక్ రోడ్లపై ఉపయోగించకూడదు. దీనిలోని 998 సీసీ ఇంజిన్‌తో వాహనం వాయువేగంతో పరుగులు తీస్తుంది. 17 లీటర్ ఇంధన ట్యాంక్, 830 మిమీ ఎత్తయిన సీటు దీనికి అదనపు ఆకర్షణ, ట్రాక్ అభిమానుల కోసం రూపొందించిన కవాసకి నింజా హెచ్2ఆర్ మోటారు సైకిల్ ధర రూ.79,90,000

2 / 5
డుకాటి పానిగేల్ వీ4 ఆర్.. వేగంతో పాటు స్టైలిష్ గా ఉంటే మోటారు సైకిల్ కోరుకునే వారికి ఇది బాగా నప్పుతుంది. 193.5 కిలోల బరువైన ఈ మోటారు సైకిల్ లో 998 సీసీ ఇంజిన్‌, 17 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్, సౌకర్యవంతమైన సీటు ఏర్పాటు చేశారు. మంచి ఇంజినీరింగ్ పనితీరు, ఇటాలియన్ లుక్ తో ఆకట్టుకునే డుకాటి పానిగేల్ వీ4 ఆర్ మోటారు సైకిల్ ధర రూ.69,99,000.

3 / 5
బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్.. ఈ మోటార్‌సైకిల్ బరువు 192 కిలోలు. దీనిలో 16.5 లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్‌, 832 మి.మీ ఎత్తయిన సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రయాణంలో దూసుకుపోయేందుకు 999 సీసీ ఇంజిన్ ఎంతో సాయపడుతుంది. మంచి పనితీరు, నాణ్యత కలిగిన బండి కోసం చూసేవారికి చక్కని ఎంపిక. బీఎండబ్ల్యూ ఎం1000 ఆర్ఆర్ మోటారుసైకిల్ ధర రూ.49 లక్షలు.

4 / 5
హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్.. విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనిలో 1,868 సీజీ ఇంజిన్‌, 22.7-లీటర్ గ్యాసోలిన్ ట్యాంక్‌, సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి. ప్రత్యేకమైన సౌండ్ తో ఆకట్టుకునే ఈ మోటారు సైకిల్ బరువు 387 కేజీలు. వేగం, సౌకర్యం రెండింటినీ అందించే హార్లే - డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ మోటార్ సైకిల్ ధర రూ.41,78,915.

5 / 5
హోండా గోల్డ్‌వింగ్ టూర్.. సుదూర ప్రాంతాల ప్రయాణానికి అనుకూలంగా ఉండే హోండా గోల్డ్ వింగ్ టూర్ మోటారు సైకిల్ లో 1,833 సీసీ ఇంజిన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఏర్పాటు చేశారు. 390 కిలోల కర్బ్ బరువు, 21.1 లీటర్ల ఇంధన ట్యాంక్ పరిమాణం, సౌకర్యవంతమైన సీటు అదనపు ప్రత్యేకతలు. పవర్ మరియు కంఫర్ట్ రెండింటినీ అందించే ఈ మోటారు సైకిల్ ధర రూ.39,77,923.