
అల్ట్రావయోలెట్ ఎఫ్77.. ఇది సూపర్ ఫాస్ట్ ఈ-బైక్. దీని టాప్ ఎండ్ మోడల్ ఏకంగా సింగిల్ చార్జ్ పై 307 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వాస్తవానికి దీనిని 2019 లాంచ్ చేసిన సమయంలో 4.3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ రిమూవబుల్ ప్యాక్‌లో వచ్చింది. అయితే 2023లో అప్ గ్రేడెవ్ వెర్షన్ ను తీసుకురాగా అది 10.3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థంతో వచ్చింది. దీని సాయంతో సింగిల్ చార్జ్ పై 307కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు 152 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 5.0-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే , ఆటో ఆన్/ఆఫ్ హెడ్‌ల్యాంప్‌లు, రియల్ టైమ్ ట్రాఫిక్ సహాయంతో నావిగేషన్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అదనపు భద్రత కోసం, దొంగతనం జరిగినప్పుడు లాక్‌డౌన్ మోడ్ కూడా ఉంది

కోమాకి రేంజర్.. ఇది క్రూయిజర్ లుక్లో అదరగొట్టే ఈ-బైక్. ఇది సింగిల్ చార్జ్ పై 250 కిలోమీటర్ల రేంజ్ న ఇస్తుంది. దీని రూ. 1.85లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలో 7-అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అంతర్నిర్మిత నావిగేషన్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ 4.5 కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

కబీరా మొబిలిటీ కేఎం4000.. ఇది మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ చార్జ్ పై 201 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. దీనిలో డ్యూయల్ సీబీఎస్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనో షాక్ రియర్ సస్పెన్షన్ తో వస్తుంది. దీని ధర రూ. 1,76,000ఎక్స్-షోరూమ్ గోవా)గా ఉంది. ఇది గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

పవర్ ఈవీ పీ- స్పోర్ట్ ప్లస్.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ పవర్ ఈవీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని పేరు పీ- స్పోర్ట్ ప్లస్ ఇది సింగిల్ చార్జ్ పై 210 కిమీ పరిధితో వస్తుంది. దీనిలో 4.8కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిలో రిమూవబుల్ గా ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది.

ఓర్క్సా మాంటిస్.. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఓర్క్సా ఎనర్జీస్ నుంచి వచ్చిన ఈ-బైక్ ఇది. సింగిల్ చార్జ్ పై 221 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇస్తుంది. దీనిని 1.3 కేడబ్ల్యూహెచ్ రెగ్యులర్ ఛార్జర్‌తో రూ . 3.6 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. 5-అంగుళాల డిజిటల్ టీఎఫ్టీ డిస్‌ప్లే, సైడ్-స్టాండ్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంది. బైక్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి, డెలివరీలు ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతాయి. గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 8.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.