టాటా పంచ్ ఈవీ.. టాటా తన ఆల్-ఎలక్ట్రిక్ లైనప్‌లో సరికొత్త సభ్యుడు పంచ్ ఈవీని పరిచయం చేసింది . ఎలక్ట్రిక్ పంచ్ దాని సాధారణ ఐసీఈ ఇంజిన్ కారు కన్నా మరిన్ని అదనపు ఫీచర్లను పొందుతుంది. టాటా పంచ్ ఈవీ అనేది Acti.ev ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం. దీనిలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు సన్‌రూఫ్ ఉంది. భద్రత కోసం ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను పొందుతుంది. దీనిలో 25 kWh మీడియం రేంజ్, 35 kWh లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు ఉన్నాయి. దీని ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల మధ్య ఉన్నాయి.