Best bikes: ట్రాఫిక్ రద్దీలోనూ రయ్ రయ్.. ఈ బైక్ లతో నగరంలో రైడింగ్ చాలా ఈజీ..!

Updated on: May 04, 2025 | 5:30 PM

ఆధునిక కాలంలో ద్విచక్ర వాహనం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని అవసరాలకూ ఉపయోగపడుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ కంపెనీలు పలు మోడళ్ల వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే గ్రామాల్లో పోల్చితే నగరాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి రోడ్లపై బైక్ లు నడపడానికి నేర్పు కావాలి. అలాగే అన్ని రకాల ద్విచక్ర వాహనాలు ఆ వాతావరణానికి సరిపోవు. మరీ ఎక్కువ బరువున్న వాటిని నియంత్రణ చేయడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో నగరాల్లోని ట్రాఫిక్ లో సౌకర్యవంతంగా నడపగలిగే ద్విచక్ర వాహనాలు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5
కుర్రకారుకి కిర్రాక్ పుట్టించే యమహా ఎఫ్ జెడ్ - ఎస్ ఎఫ్ఐ వీ4 బైక్ కూడా నగరంలో వినియోగానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ బండి బరువు 136 కిలోలే కావడం విశేషం. దీనిలోని 149 సీసీ ఇంజిన్ నుంచి 12.4 బీహెచ్ పీ, 13.3 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది. సౌకర్యవంతమైన 790 ఎంఎం సీటు, 1330 ఎంఎం వీల్ బేస్ కారణంగా నగరంలోని అస్తవ్యస్త ట్రాఫిక్ లో చాలా సులువుగా నియంత్రణ చేయవచ్చు.

2 / 5
నగర ట్రాఫిక్ లో సులభంగా నడిపే మోటార్ సైకిళ్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 ఒకటి. ఈ కంపెనీకి ఇతర బైక్ లతో పోల్చితే హంటర్ సుమారు 181 కిలోలు తక్కువ బరువు ఉంటుంది. దీంతో చాలా తేలికగా నడిపే వీలు కలుగుతుంది. దీనిలోని 349 సీసీ ఇంజిన్ నుంచి 20.2 బీహెచ్ పీ శక్తి, 27 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. 1370ఎంఎం వీల్ బేస్, 790 ఎంఎం సీటు ఎత్తు కారణంగా మలుపుల్లోనూ రైడర్లు చాలా సులువుగా డ్రైవింగ్ చేయవచ్చు.

3 / 5
రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా చాలా సులువుగా దూసుకుపోవడం హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ మోటారు సైకిల్ ప్రత్యేకత. 145 కిలోల బరువు, 1327 ఎంఎం వీల్ బేస్, 795 ఎంఎం సీటు ఎత్తు కలిగిన ఈ బైక్ తో రైడింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 163 సీసీ ఇంజిన్ నుంచి 16.9 బీహెచ్ పీ శక్తి, 14.6 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్, ట్రాఫిక్ లో కూడా నావిగేట్ చేయడానికి వీలుగా ఉండే హ్యాండ్లింగ్ అదనపు ప్రత్యేకతలు.

4 / 5
చాలా సులువుగా నియంత్రణ చేయదగిన బైక్ లలో హోండా హార్నెట్ 2.0 ఒకటి. దీని బరువు కేవలం 142 కిలోలు మాత్రమే. హోండా హార్నెట్ 2.0 బైక్ లో 184.40 సీసీ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 17.03 బీహెచ్పీ, 15.7 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. 790 ఎంఎం ఎత్తు గల సీటు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. 1356 ఎంఎం వీల్ బేస్, హ్యాండ్లింగ్ యూఎస్ డీ ఫ్రంట్ ఫోర్కుల ద్వారా డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది.

5 / 5
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 పెరిమీటర్ ఫ్రేమ్ తో నగరంలో రైడింగ్ చాాలా సులభంగా చేయవచ్చు. 1363 ఎంఎం వీల్ బేస్, 805 ఎంఎం సీటు ఎత్తు, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ తో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని లిక్విడ్ కూల్డ్ 199.5 సీసీ ఇంజిన్ నుంచి 24.13 బీహెచ్ పీ, 18.7 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. 158 కిలోల బరువు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ రైడింగ్ మాత్రం చాలా సౌకర్యంగా ఉంటుంది.