హోండా హార్నెట్ 2.0 మోటారు సైకిల్ లో 184 సీసీ సింగిల్ సిలిండర్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 17 హెచ్ పీ, 15.9 ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, ముందు భాగంలో యూఎస్ డీ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ తో ఆకట్టుకుంటోంది. లీటరుకు 42.3 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. హోండా హార్నెట్ 2.0 మోటారు సైకిల్ ధర రూ.1.40 లక్షలు.